America : గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స.. తల్లీబిడ్డలు క్షేమం

America : గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స.. తల్లీబిడ్డలు క్షేమం

baby brain Surgery

America : వైద్య రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్ర చికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్ర చికిత్స చేసేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు. గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. గర్భస్థ శిశువుల్లో అరుదుగా వచ్చే వాస్కులర్ వైకల్యానికి శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డలను రక్షించారు. బోస్టన్ చిల్ట్రన్ హాస్పిటల్, బ్రిషుం, మహిళల ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

గర్భస్థ శిశువుల్లో మెదడుకు వచ్చే ఈ వ్యాధిని గాలెన్ వైకల్యం అని అంటారు. మెదడులో పొరలుగా మారిన ధమనులు కేశ నాళికలకు బదులుగా నేరుగా సిరలకు అనుసంధానమైనప్పుడు ఏర్పడే స్థితినే గాలెన్ వైకల్యం అని అంటారు. దీని కారణంగా రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. తద్వారా రక్తపీడనం అధికమై సిరలపై ప్రభావం చూపుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగించి, కణజాలలు దెబ్బతింటాయి.

Tadepalle Manipal Hospitals : 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి.. అరుదైన ఆపరేషన్ చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

ప్రస్తుతం శిశువు పుట్టాక శస్త్ర చకిత్స చేస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా శిశువు మరణిస్తున్నారు.
దీంతో ఈ సమస్యకు కొత్త చికిత్స విధానం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బోస్టన్ ఆస్పత్రి డాక్టర్లు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. గర్భంలోని 34 వారాల శిశువుకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం తలి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.