NEET UG 2026 Students Alert : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. MBBS, BDS అడ్మిషన్లకు మళ్లీ ఛాన్స్.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!

NEET UG 2026 Students Alert : తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు 2026-27 కోసం KNRUHS ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మళ్లీ ప్రారంభించింది. నీట్ యూజీ-2026 అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేయొచ్చు.

KNRUHS Re opens Online Registration

  • మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారా?
  • ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్‌లైన్ అడ్మిషన్లు మళ్లీ ఓపెన్
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ మళ్లీ మొదలైంది
  • ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల్లోపు రిజిస్ట్రేషన్

NEET UG 2026 Students Alert : నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి.
విద్యార్థులకు ఇదే ఛాన్స్..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ (KNRUHS) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్లీ ప్రారంభించింది.

అభ్యర్థుల అభ్యర్థనలు వెల్లువెత్తడంతో యూనివర్సిటీ, రిజిస్ట్రేషన్‌కు అదనపు అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ తెలిపింది. నీట్ యూజీ-2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ ఆపై ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది.

Read Also : BC Reservations : బీసీలకు 34శాతం కోటా.. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన!

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసే ప్రాసెస్ ఆగస్టు 18, 2026 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఆగస్టు 20, 2026 సాయంత్రం 6 గంటలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అప్లయ్ చేసిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ స్పష్టం చేసింది.

అర్హత, అవసరమైన సర్టిఫికేట్లు, ఇతర రూల్స్ సంబంధించి పూర్తి వివరాలను అభ్యర్థులు గత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌లో చెక్ చేసుకోవాలి. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు అధికారిక అడ్మిషన్ పోర్టల్ (tsmedadm.tsche.in) ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.