Niper 2022 : నైపర్ 2022 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 3, 2022 నిర్ణయంచారు. ప్రవేశ పరీక్ష ను జూన్‌ 12, 2022తేదిన నిర్వహించనున్నారు.

Olympus Digital Camera

Niper 2022 : 2022-23 విద్యాసంవత్సరానికి గాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (NIPER JEE 2022) నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మసీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నైపర్‌ జేఈఈ పరీక్షను నైపర్‌ హైదరాబాద్‌ నిర్వహించనుంది. కోర్సుల వివరాలకు సంబంధించి ఎంఫార్మసీ, ఎంఎస్‌ ఫార్మా, ఎంటెక్‌ ఫార్మా, ఎంబీఏ ఫార్మా, పీహెచ్‌డీ కోర్సుల్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశం పొందవచ్చు. బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ తదితర విభాగాల్లో ఈ కోర్సులు ఉన్నాయి.

ఎంట్రన్స్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన వారు అహ్మదాబాద్‌, గువహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌ నైపర్ క్యాంపస్ ల్లో ప్రవేశం పొందవచ్చు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జీప్యాట్, గేట్‌, నెట్‌ జాతీయ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రకియ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 3, 2022 నిర్ణయంచారు. ప్రవేశ పరీక్ష ను జూన్‌ 12, 2022తేదిన నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు http://www.niperhyd.ac.in/ సంప్రదించగలరు.