Representative image
Andhra Pradesh: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2023 (AP EAPCET) ఈ సారి కూడా జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జేఎన్టీయూ (అనంతపురం) వీసీ రంగ జనార్దన్ ( Prof. G. Ranga Janardhana), ఎగ్జామ్ కన్వీర్ శోభా బింధు తెలిపారు. మే 15 నుంచి AP EAPCET ప్రారంభం కానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 3,37,733 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ 2,37,193 మంది, బైపీసీ 96,557 మంది, రెండు కలిపి రాసే వారు 983 మంది ఉన్నారు. గత ఏడాది ఈ సెట్ కు దాదాపు 3 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 136 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.
మే 15 నుంచి 19 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్ష జరుగుతుంది. మే 22 నుంచి 23 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగపు పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.
AP EAPCET-2023