RITES RECRUITMENT : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ లో ఇంజినీర్ పోస్టుల భర్తీ
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.42,478లతోపాటు ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
- Guntupalli Ramakrishna
- Published On : August 30, 2022 / 11:19 AM IST
Rail India Technical and Economic Service Limited
RITES RECRUITMENT : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 20 ఇంజినీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ/బీటెక్/ఇంజినీరింగ్‌లో బీఎస్సీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 40 యేళ్లకు మించకుండా ఉండాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.42,478లతోపాటు ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rites.com/పరిశీలించగలరు.
