మంచి అవకాశం : నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్, వసతులు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత శిక్షణ కోసం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. 3 నెలలు కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 16న భూదాన్ పోచంపల్లిలోని సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
శిక్షణ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ.6వేలు నుంచి రూ.8వేలు వరకు ఉంటుంది. 6 నెలల నుంచి ఏడాది లోపు నిబంధనల ప్రకారం వేతన పెంపు ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 9133908111, 9133908222, 9948466111 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.
* కోర్సులు – అర్హత:
రంగం | శిక్షణకాలం | అర్హత |
ఆటోమొబైల్ | 3 నెలలు | 10వ తరగతి |
ఎలక్ట్రానిక్ రిపేర్ | 3 నెలలు | 10వ తరగతి |
ఎలక్ట్రీషియన్ | 4 నెలలు | 10వ తరగతి |
DTP | 3 నెలలు | ఇంటర్ |
అకౌంట్స్ (ట్యాలీ) | 3 నెలలు | బీకామ్ |
కంప్యూటర్ హార్డ్‌వేర్ | 3 నెలలు | ఇంటర్ |
సోలార్ సిస్టమ్ | 3 నెలలు | ఇంటర్ |
టైలరింగ్ | 3 నెలలు | 7వ తరగతి |
హైదరాబాద్ మాదాపూర్‌లోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అపారెల్ ట్రైనింగ్, డిజైన్ సెంటర్ (ATDC) శిక్షణ సంస్థలో ‘ఇండస్ట్రియల్ ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్’ కోర్సులో 8 నెలల ఉచిత శిక్షణకు కూడా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ దగ్గర్లోని ATDC కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత. 18 నుంచి 35 సంవత్సరాల వయసు వారు మాత్రమే అర్హులు. అభ్యర్థులకు శిక్షణకాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తారు.
*ఆసక్తి గల అభ్యర్ధులు:
– ఫిబ్రవరి 16న(శనివారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాల్సి ఉంటుంది.
* కౌన్సిలింగ్‌కు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి..
– ఒరిజినల్ సర్టిఫికేట్లు
– పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
– ఆధార్ కార్డు
– రేషన్ కార్డు