LIC Recruitment 2025 : డిగ్రీ పాస్ అయ్యారా.. మీ కోసమే ఈ ఉద్యోగాలు.. ఎల్ఐసీలో 800 పోస్టులు.. ఫీజు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..
అర్హత ప్రమాణాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం LIC కెరీర్స్ పేజీలో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.(LIC Recruitment 2025)

LIC Recruitment 2025 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO), అసిస్టెంట్ ఇంజనీర్స్ (AE) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 841 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు ఈ స్థానాలకు అధికారిక వెబ్‌సైట్ licindia.in లో సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్: 410 పోస్టులు
* అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO-జనరలిస్ట్): 350 పోస్టులు
* అసిస్టెంట్ ఇంజనీర్లు: 81 పోస్టులు
మీరు AAO జనరలిస్ట్ పోస్టుకు అప్లయ్ చేయాలంటే.. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆగస్టు 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అర్హత ప్రమాణాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం LIC కెరీర్స్ పేజీలో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
LIC రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం – ఆగస్ట్ 16 2025
రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ – సెప్టెంబర్ 8 2025
కాల్ లెటర్ డౌన్ లోడ్ – పరీక్షకు 7 రోజుల ముందు
ప్రిలిమ్స్ పరీక్ష – సెప్టెంబర్ 10 2025
మెయిన్స్ పరీక్ష – నవంబర్ 8 2025
LIC రిక్రూట్‌మెంట్ 2025.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి..
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ licindia.in ని సందర్శించండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో AAO జనరలిస్ట్/స్పెషలిస్ట్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ రిజిస్ట్రేషన్ లింక్ కోసం చూసి దానిపై క్లిక్ చేయండి
స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఆపై లాగిన్ అవ్వండి
స్టెప్ 4: దరఖాస్తు ఫారమ్‌ను నింపండి
స్టెప్ 5: సూచించిన పత్రాలను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి
స్టెప్ 6: ఫామ్ సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి
LIC రిక్రూట్‌మెంట్ 2025: అప్లికేషన్ ఫీజు
కేటగిరీ వారీగా అప్లికేషన్ ఫీజు వివరాలు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్లుబీడీ – అప్లికేషన్ ఫీజు 85 రూపాయలు + ట్రాన్సాక్షన్ ఛార్జీలు + జీఎస్టీ
ఇతర అభ్యర్థులు – అప్లికేషన్ ఫీజు 700 రూపాయలు + ట్రాన్సాక్షన్ ఛార్జీలు + జీఎస్టీ
AAO ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఆ తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ప్రిలిమ్స్ (ఫేజ్ 1)లో సాధించిన మార్కులు తుది ఎంపిక జాబితాకు పరిగణించబడవని గమనించాలి.