UGC New Order: యూనివర్సిటీలు, కాలేజీలకు UGC అర్జంట్ అలర్ట్.. ఆ కోర్సుల్లో అడ్మిషన్లు వెంటనే ఆపేయండి..

ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC New Order) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యా సంస్థలు అందించే పలు కోర్సులు..

UGC New Order: యూనివర్సిటీలు, కాలేజీలకు UGC అర్జంట్ అలర్ట్.. ఆ కోర్సుల్లో అడ్మిషన్లు వెంటనే ఆపేయండి..

UGC New Order

Updated On : August 16, 2025 / 1:01 PM IST

UGC New Order: ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC New Order) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యా సంస్థలు అందించే పలు కోర్సులు రద్దు చేయాలని సూచించింది.

ఆరోగ్య సంరక్షణ, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 కిందికి వచ్చే కోర్సులను జులై -ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్, ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బోధించడం నిలిపివేయాలని ఆదేశించింది.

జులై -ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని, కాలేజీలు, యూనివర్శిటీలు ఆయా పద్దతుల ద్వారా కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ సహా ఆరోగ్య సంరక్షణ కోర్సులన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు యూజీసీ తెలిపింది.

24వ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల మేరకు జులై 23న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని పేర్కొంటూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, గణితం, ప్రజాపరిపాలన, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, గణాంకాలు, మానవహక్కులు – విధులు, సంస్కృతం, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మహిళా అధ్యయనాలు వంటి అంశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ వంటి బహుళ స్పెషలైజేషన్లను యథాతథంగా అందిస్తామని యూజీసీ తెలిపింది.

Also Read: Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉస్మానియాలో జాబ్ మేళా.. రూ.1.80 లక్షల జీతం.. అర్హత, పూర్తి వివరాలు మీకోసం