×
Ad

RBI Grade B Exam 2025 Result: ఆర్బీఐలో జాబ్స్.. ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

ఫేజ్-I పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు RBI గ్రేడ్ B ఫేజ్-II పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

RBI Grade B Exam 2025 Result: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) లో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://rbi.org.in/ లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డిసెంబర్ 6న ఫేజ్-2 ఎగ్జామ్ జరగనుంది. అందులోనూ సెలక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అక్టోబర్ 18న ఫేజ్ పరీక్షలు జరిగాయి. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో విడుదల చేశారు. అందులో రోల్ నెంబర్లు ఇచ్చారు.

ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ..
* అఫీషియల్ వెబ్ సైట్ rbi.org.in కి వెళ్లాలి.
* హోంపేజీలో ‘Opportunities@RBI’ సెక్షన్ కి వెళ్లాలి.
* ‘Current Vacancies’ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ‘Results’ సెలెక్ట్ చేయాలి.
* “Result of Phase-I Examination for Recruitment of Officers in Grade ‘B’ (DR) లింక్ పై క్లిక్ చేయాలి.
* రిజల్ట్ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
* ఆ లిస్టులో మీ రోల్ నెంబర్ చేసుకోవాలి.
* పీడీఎఫ్ ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

ఫేజ్-I పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు RBI గ్రేడ్ B ఫేజ్-II పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. దీనికి సంబంధించిన షెడ్యూల్, అడ్మిట్ కార్డ్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

Also Read: ఇది కదా ఫోన్ అంటే.. మరో 2 రోజుల్లో వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. ధర ఎంత ఉంటుందో తెలిస్తే షాకవుతారు..!