Anganwadi Recruitment : విజయనగరం జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published on- February 6, 2023 / 03:15 PM IST
Anganwadi Recruitment
Anganwadi Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ విజయనగరం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు సంబంధించి వెబ్ సైట్ ; https://vizianagaram.ap.gov.in/ పరిశీలించగలరు.
