ICMR-NIIH Recruitment : ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా నర్సింగ్, మిడ్‌వైఫరీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీహెచ్‌ఎంఎస్/సోషియాలజీలో ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : October 2, 2022 / 02:11 PM IST
ICMR-NIIH Recruitment
ICMR-NIIH Recruitment : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న ఖాళీల్లో సైంటిస్ట్ ‘సి’, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా నర్సింగ్, మిడ్‌వైఫరీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీహెచ్‌ఎంఎస్/సోషియాలజీలో ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 34 యేళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 6, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.niih.org.in/ పరిశీలించగలరు.
