NMDC Ltd Recruitment : హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2.6 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Recruitment of job vacancies in National Mineral Development Corporation, Hyderabad

NMDC Ltd Recruitment : భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 జాయింట్‌ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

లా, పర్సనల్‌, కెమికల్, ఎన్విరాన్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పీజీడిగ్రీ/పీజీ డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2.6 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి గడువు నవంబర్‌ 24, 2022వ తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nmdc.co.in/careers పరిశీలించగలరు.