Appsc Jobs: ఏపిలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : April 19, 2022 / 11:18 AM IST
Appsc
Appsc Jobs: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపిలో ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. మొత్తం 9ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 40,270రూ నుండి 93,780రూ జీతభత్యాలుగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 20, 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తలకు చివరి తేది మే 10, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://psc.ap.gov.in/ పరిశీలించగలరు.
