Contract Jobs : చిత్తూరు జిల్లాలో వైద్యఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాలు మించరాదు. అభ్యర్ధుల అర్హతకు సంబంధించి పదోతరగతి , ఇంటర్, బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : June 25, 2022 / 01:18 PM IST
Jobs
Contract Jobs : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఏపీ వైద్య విధాన పరిషత్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టు 1 ఖాళీ, ఆడియోమెట్రీషియన్ పోస్టులు 4 ఖాళీలు, ప్లంబర్ పోస్టులు 5 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ 3 ఖాళీలు, ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాలు మించరాదు. అభ్యర్ధుల అర్హతకు సంబంధించి పదోతరగతి , ఇంటర్, బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 15,000 నుండి 18,500రూ వరకు వేతనంగా చెల్లిస్తారు.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ ఆస్పిటల్ సర్వీసెస్, చిత్తూరు జిలా, ఏపీ అనే చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలకు సంబంధించి వెబ్ సైట్ ; https://chittoor.ap.gov.in/# పరిశీలించగలరు.
