BECIL JOBS : న్యూదిల్లీ బీఈసిఐఎల్ లో డేటా ఎంట్రీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్ స్సీడ్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : May 9, 2022 / 07:20 PM IST
Becil Jobs
BECIL JOBS : న్యూ దిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసిఐఎల్) లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 86 డేటా ఎంట్రీ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్ స్సీడ్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 21,184రూ వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.becil.com/ పరిశీలించగలరు.
