Nsut Jobs : న్యూదిల్లీ ఎన్ఎస్ యుటి లో టీచింగ్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : April 28, 2022 / 10:57 AM IST
Nsut Jobs
Nsut Jobs : న్యూదిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 152 పోస్టుల నియమకాలు జరపనున్నారు. ఆసక్తిగల అర్హలైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబందించి ప్రొఫెసర్ పోస్టులు 12, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 38, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 102 ఉన్నాయి.
అర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఆంట్రో్రపెన్యూర్ షిప్ వెంచర్ డెవలప్ మెంట్ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 ఏళ్ల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైనేషన్ లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 10, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://nsut.ac.in/ పరిశీలించగలరు.
