UPSC Jobs : యూపీఎస్సీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : April 11, 2022 / 01:08 PM IST
Upsc Jobs
UPSC Jobs : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూదిల్లీలోని వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్లు 5 ఖాళీలు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు 2, లెక్చరర్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ 3 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 28, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in/సంప్రదించగలరు.
