Sail Recruitment: పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. SAIL లో 1,110 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా చేసుకోండి
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sail Recruitment) లిమిటెడ్ 1,110 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- V Santhosh Kumar
- Published on- July 20, 2026 / 02:44 PM IST
SAIL released a notification for 1,110 apprentice posts.
- సేల్ లో 1110 పోస్టులు
- రాత పరీక్ష లేకుండా ఎంపిక
- ఆగస్టు 26 వరకు దరఖాస్తులు
Sail Recruitment: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sail Recruitment) లిమిటెడ్ (SAIL) పరిధిలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 1,110 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్, వాక్-ఇన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం ఈ నియామకాల ప్రత్యేకత.
Ration: గుడ్ న్యూస్.. 3 నెలల రేషన్ ఒకేసారి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఖాళీలు, అర్హతలు వయోపరిమితి వివరాలు:
ఈ ప్రకటనలో ట్రేడ్ అప్రెంటిస్ (421), డిప్లొమా అప్రెంటిస్ (414), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (275) పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ITI, ఇంజినీరింగ్/నర్సింగ్ డిప్లొమా, లేదా BA, B.Com, B.Sc, BCA వంటి డిగ్రీలను 2022-2026 మధ్య పూర్తి చేసిన వారు అర్హులు. ఆగస్టు 31, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుండి రూ.12,300 వరకు స్టైపెండ్ లభిస్తుంది.
దరఖాస్తు విధానం, చివరి తేదీ:
ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతను బట్టి Apprenticeship India లేదా NATS పోర్టల్‌లో నమోదు చేసుకుని, SAIL రూర్కెలా స్టీల్ ప్లాంట్‌ను ఎంచుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 26, 2026. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ 2026లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పబ్లిక్ సెక్టార్‌లో అనుభవం సాధించడానికి ఇది మంచి అవకాశం.
