SVNIT Recruitment :
SVNIT Recruitment : సూరత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్వీనిట్‌లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 17 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.svnit.ac.in/ పరిశీలించగలరు.