SBI Clerk Admit Card 2024 : ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డు రిలీజ్ డేట్ తెలిసిందోచ్.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఇవేనా? ఇప్పుడే చెక్ చేసుకోండి!

SBI Clerk Admit Card 2024 : ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేసి హాల్ టిక్కెట్‌లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..

SBI Clerk Admit Card 2024

SBI Clerk Admit Card 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అభ్యర్థులకు అలర్ట్.. ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల తేదీని ప్రకటించింది. జూనియర్ అసోసియేట్ పోస్టులకు తాత్కాలిక పరీక్ష తేదీలను కూడా విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in)లో అడ్మిట్ కార్డ్ తేదీ, పరీక్ష తేదీలను చెక్ చేయవచ్చు.

షెడ్యూల్ ప్రకారం.. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డ్‌ను ఫిబ్రవరి 10, 2025 నాటికి విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లింక్ యాక్టివేట్ అయిన తర్వాత ఎస్బీఐ వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తాత్కాలికంగా ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1, 2025 తేదీలలో నిర్వహించనున్నారు. పరీక్షా సమయం ఒక గంట పాటు ఉంటుంది.

మొత్తం పోస్టులు ఇవే  :
ఎస్‌బీఐ ఈ జూనియర్ అసొసియేట్స్ పోస్టుల కోసం మొత్తం 13,735 ఖాళీలను ప్రకటించింది. వీటిలో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5,870 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 3,001 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 2,118 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 1,385 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 1,361 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఎంపికైనవారికి జీతం ఎంతంటే? :
ఈ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో అభ్యర్థులు తప్పనిసరిగా మెయిన్ పరీక్షకు అర్హత సాధించాలి. మెయిన్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్షకు హాజరు కావాలి. ఈ దశలన్నీ పూర్తయిన తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన వారికి రూ.17,900 నుంచి రూ.47,920 మధ్య వేతనం లభిస్తుంది.

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసేందుకు అభ్యర్థులు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.

1. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని (sbi.co.in)లో సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న (Careers) లింక్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు ప్రస్తుత ఓపెనింగ్స్ లింక్‌పై క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు అదే పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
5. లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, (Submit)పై క్లిక్ చేయండి.
6. ఆ తర్వాత, మీ అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది.
7. అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేయండి. ఆపై పేజీని డౌన్‌లోడ్ చేయండి.
8. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అదే హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.

పరీక్షా విధానం :
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్ష ఒక గంట పాటు కొనసాగుతుంది. మొత్తం 3 సెక్షన్లను కలిగి ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు వస్తాయి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులో నాల్గవ వంతు ప్రతి తప్పు సమాధానానికి తొలగిస్తారు. వ్యక్తిగత పరీక్షలకు లేదా మొత్తం స్కోర్‌లకు కనీస అర్హత మార్కులు ఉండవు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభమై జనవరి 7, 2025న ముగిసింది. ఇంతలో, ఎస్బీఐ క్లర్క్ ప్రీ-ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్ గతవారమే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అయింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.