TISS Recruitment : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరు , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19, 2023 చివరి తేదిగా నిర్ణయించారు.

TISS Recruitment

TISS Recruitment : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 113 పోస్టుల ను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ తో పాటు ఇతర వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Pawan Kalyan : అభిమానులందు పవన్ అభిమానులు వేరయా.. 470 కేజీల వెండితో..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు హెల్త్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సైన్సెస్ , అనుబంధ రంగాలలో మాస్టర్స్ డిగ్రీ మరియు ప్రాజెక్ట్ అమలు పనిలో ఐదు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. రాయడం మరియు మాట్లాడటంలో నైపుణ్యం ఉండాలి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ పోస్టుకుగాను హెల్త్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సైన్సెస్, అనుబంధ రంగాలలో మాస్టర్స్ డిగ్రీ మరియు ప్రాజెక్ట్ అమలు పనిలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. రాయడం మరియు మాట్లాడటంలో నైపుణ్యం కలిగి ఉండాలి.

అకౌంటెంట్స్ కామర్స్ పోస్టుకు సంబంధించి అకౌంటెన్సీ , అనుబంధ రంగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ , ప్రాజెక్ట్ ఫైనాన్స్ ,అకౌంట్స్ మేనేజ్‌మెంట్ వర్క్‌లో రెండేళ్ల పని అనుభవం. రాయడం,మాట్లాడటంలో నైపుణ్యం ఉండాలి. ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ కమ్ ఫీల్డ్ ఆఫీసర్స్ పోస్టుకు ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు ప్రాజెక్ట్ అమలు, నిర్వహణ మరియు ఫీల్డ్ వర్క్‌లో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.

READ ALSO :  Chili Narumadi : అధిక దిగుబడుల కోసం మిరప నారుమడిలో యాజమాన్యం

అప్పర్ డివిజన్ క్లర్క్స్ (అడ్మిన్ అసిస్టెంట్)-ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు రెండు సంవత్సరాల పని , ప్రాజెక్ట్ అమలు, నిర్వహణ మరియు కార్యాలయ పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్-ఏదైనా రంగంలో ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు ప్రాజెక్ట్ అమలు, నిర్వహణ మరియు ఫీల్డ్ వర్క్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

ఖాళీ వివరాలకు సంబంధించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ -3, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు (PC)-6, అకౌంటెంట్స్-2, ప్రోగ్రామ్ అసిస్టెంట్లు కమ్ ఫీల్డ్ ఆఫీసర్లు-5, అప్పర్ డివిజన్ క్లర్క్స్ (అడ్మిన్ అసిస్టెంట్)-2. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్-95 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి స్థూల నెలవారీ వేతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ -రూ 70000/-, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు (PC)-రూ 65000/-, అకౌంటెంట్లు-రూ. 45000/-, ప్రోగ్రామ్ అసిస్టెంట్లు కమ్ ఫీల్డ్ ఆఫీసర్లు-రూ 42000/-, అప్పర్ డివిజన్ క్లర్కులు (అడ్మిన్ అసిస్టెంట్)-రూ 30000/-, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు-రూ. 35000/- చెల్లిస్తారు.

READ ALSO : Ginger Crop : అల్లంపంటలో దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణ

వ్రాత పరీక్షలో అభ్యర్థుల పనితీరు , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://www.tiss.edu/ పరిశీలించగలరు.