TCS Smart Hiring : టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023 దరఖాస్తుల ఆహ్వానం
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీసీఏ, బీఎస్సీ, (గణితం,ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీవోకేషనల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులు 10వతరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు ఉండాలి.

TCS Smart Hiring Freshers
TCS Smart Hiring : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్ధ స్మార్ హైరింగ్ 2023 పేరుతో ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపికలో ప్రతిభ కనబరిచిన వారు ఇగ్నైట్ లోని సైన్స్ టు సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్ లో చేరేందుకు అవకాశం లభిస్తుంది.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీసీఏ, బీఎస్సీ, (గణితం,ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీవోకేషనల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులు 10వతరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు ఉండాలి.
పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా 31 జనవరి 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.tcs.com పరిశీలించగలరు.