Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఐపీఎల్‌కు గుడ్‌బై..

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు..

Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఐపీఎల్‌కు గుడ్‌బై..

Ravichandran Ashwin Announces IPL Retirement

Updated On : August 27, 2025 / 11:36 AM IST

Ravichandran Ashwin : టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆల్‌రౌండ‌ర్ తాజాగా ఐపీఎల్ (IPL) కు కూడా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదిక‌గా అత‌డు వెల్ల‌డించాడు.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో అత‌డు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2026 ఐపీఎల్ వేలానికి ముందు ట్రేడ్ విండో ద్వారా అత‌డు తిరిగి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు వ‌స్తాడు అని వార్త‌లు వ‌స్తున్న క్ర‌మంలో అశ్విన్ రిటైర్‌మెంట్ నిర్ణ‌యం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో.. ఆస్ట్రేలియాతో బోర్డ‌ర్ గావాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ మధ్య‌లోనే అశ్విన్ టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.

Michael Clarke : ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు మైఖేల్ క్లార్క్‌కు క్యాన్స‌ర్‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోని షేర్ చేస్తూ..

‘ఈ రోజు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ రోజు. ఒక ప్రత్యేకమైన ఆరంభం. ప్రతి ముగింపు ఇంకోదానికి కొత్త ప్రారంభం. ఐపీఎల్‌తో నా జ‌ర్నీ ఈరోజుతో ముగుస్తుంది. అయితే.. వివిధ లీగ్‌ల చుట్టూ ఆటను అన్వేషించే సమయం నేటి నుంచే ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌లో నాకు అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి కృతజ్ఞతలు. నా ముందున్న వాటిని ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను.’ అని అశ్విన్ తెలిపాడు.

Hanuma Vihari : హ‌నుమ విహారి కీల‌క నిర్ణ‌యం.. ఆంధ్రాకు గుడ్ బై.. కొత్త అధ్యాయం మొద‌లు అంటూ..

2009లో అశ్విన్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. చెన్నై, పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, పుణె జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఆడాడు. 187 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 833 ప‌రుగులు సాధించాడు.

విదేశీ లీగ్‌లు ఆడేందుకే..!
భార‌త క్రికెట‌ర్లు విదేశీ లీగ్‌లు ఆడాలంటే.. బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పి ఉండాలి. అశ్విన్ విదేశాల్లో లీగ్‌లు ఆడాల‌ని అనుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అత‌డు ఐపీఎల్‌కు అత‌డు వీడ్కోలు ప‌లికాడు. ఇప్ప‌టికే దినేశ్ కార్తీక్ వంటి ఆట‌గాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతున్నారు.