Telangana Inter Board: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల విధానంలో భారీ మార్పులు, కొత్త గ్రూప్ ప్రారంభం..

ఇంటర్ ఫస్టియర్ కి సంబంధించి నిపుణుల కమిటీ ద్వారా పాఠ్య పుస్తకాలను సవరించారు. డయాగ్రమ్స్, క్యూఆర్ కోడ్‌లు (QR Codes), నాలెడ్జ్ బాక్స్‌లు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, సిమ్యులేషన్స్‌ను జత చేశారు.

  • Updated on- May 14, 2026 / 10:36 PM IST

Telangana Inter Board: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో భారీ మార్పులు చేసింది. ఇకపై ఇంటర్ ఫస్టియర్ లో ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఫస్టియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ పెట్టనుంది. అంతేకాదు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ పరీక్షలకు కేటాయించింది.

అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27 ) నుంచి కొత్త పరీక్షా విధానం అమల్లోకి రానుంది. ఆక్టివిటీ బేస్డ్ లర్నింగ్ (ABL) మూల్యాంకనం అమలు కానుంది. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 15+15 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానం అమలు కానుంది. హ్యూమానిటీస్ (కామర్స్, అకౌంటెన్సీ), లాంగ్వేజేస్ లలో ఇంటర్నల్స్ కు 20 మార్కులు.. థియరీ పరీక్షలు 80 మార్కులకు నిర్వహిస్తారు. అకౌంటెన్సీ-కామర్స్-ఎకనామిక్స్‌తో కొత్తగా ACE గ్రూప్ ప్రవేశపెట్టింది ఇంటర్ బోర్డ్.

ఇంటర్ ఫస్టియర్ లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఫస్టియర్ లో 15, సెకండియర్ లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో థియరీ ఎగ్జామ్ కు 60 మార్కులు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కింద ఫస్టియర్ లో 15 మార్కులు, సెకండియర్ లో 15 మార్కులు కేటాయిస్తారు. హ్యుమానిటీస్, లాంగ్వేజస్ లో ఇంటర్నల్స్ కు 20 మార్కులు, పరీక్షలు 80 మార్కులకు నిర్వహిస్తారు.

థియరీ పరీక్ష 60 మార్కులకు..

గతంలో ఇంటర్నల్ మార్కులు ఉండేవి కావు. థియరీ 75 మార్కులకు ఉండేది. ఇప్పుడు కొత్తగా ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) ద్వారా ఫస్టియర్ లో 15 మార్కులు, సెకండియర్ లో 15 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోసం కేటాయించారు. గతంలో కేవలం సెకండియర్ లోనే 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండేవి. ఇప్పుడు వీటిని రెండు సంవత్సరాలకు విభజించారు. ఫస్టియర్ లో 15 మార్కులు, సెకండియర్ లో 15 మార్కులుగా కేటాయించారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది.

హ్యుమానిటీస్, లాంగ్వేజస్..
కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ వంటి హ్యుమానిటీస్ గ్రూపులతో పాటు అన్ని భాషా సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొదలైనవి) 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ (ABL) ప్రవేశపెట్టారు. దీని వల్ల థియరీ పరీక్ష 100 మార్కుల నుండి 80 మార్కులకు తగ్గింది.

MEC గణితం:
MEC విద్యార్థుల కోసం ప్రత్యేక క్వశ్చన్ పేపర్‌ను రూపొందించారు. వీరికి కూడా 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్, 80 మార్కుల థియరీ పరీక్ష ఉంటుంది.

కొత్త గ్రూప్:
అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో ACE అనే కొత్త గ్రూప్ ప్రారంభం

QR కోడ్స్, డయాగ్రామ్స్‌తో ఇంటర్ పాఠ్య పుస్తకాలు..

ఇంటర్ ఫస్టియర్ కి సంబంధించి నిపుణుల కమిటీ ద్వారా పాఠ్య పుస్తకాలను సవరించారు. ఈ కొత్త పుస్తకాలు 2026-27 విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తాయి. వీటిని మరింత ఆధునికంగా మార్చడానికి డయాగ్రమ్స్, క్యూఆర్ కోడ్‌లు (QR Codes), నాలెడ్జ్ బాక్స్‌లు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, సిమ్యులేషన్స్‌ను జత చేశారు. సవరించిన ఈ పాఠ్యపుస్తకాలను జూన్ 1, 2026 లోపు విద్యార్థులకు అందజేయాలని బోర్డు నిర్ణయించింది.

Also Read: తెలుగు రాష్ట్రాల ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఎస్ఐఆర్.. ఎప్పటి నుంచి అంటే..