Special TG TET Results : స్పెషల్ టెట్‌లో సత్తా చాటిన టీచర్లు.. నవంబర్‌లో మరో స్పెషల్ టెట్
Special TG TET Results : ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. 70.07 శాతం మంది అర్హత సాధించారు. నవంబర్‌లో మరో స్పెషల్ టెట్ నిర్వహించనున్నారు.
- Sreehari A
- Published on- September 27, 2026 / 03:26 PM IST
Special TG TET Results
- ఇన్‌సర్వీస్ టీచర్ల స్పెషల్ టెట్ ఫలితాలు విడుదల.. 70 శాతం మందికి అర్హత
- ఇన్‌సర్వీస్ టీచర్లకు కీలక ప్రకటన.. అక్టోబర్ 1న టెట్ నోటిఫికేషన్
- ఇన్‌సర్వీస్ టీచర్లకు మరో అవకాశం.. నవంబర్‌లో స్పెషల్ టెట్
Special TG TET Results : తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం తొలిసారి నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 70.07 శాతం మంది అభ్యర్థులు టెట్ అర్హత పొందారు. ఇప్పటివరకు జరిగిన టెట్ పరీక్షలతో పోలిస్తే.. ఈసారి నమోదైన ఉత్తీర్ణత శాతం భారీగా ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సెప్టెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు పేపర్-1, పేపర్-2లకు కలిపి 24,986 మంది అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 22,477 మంది పరీక్ష రాయగా, 15,749 మంది అర్హత సాధించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సెప్టెంబరు 26న హైదరాబాద్ సైఫాబాద్‌లో స్పెషల్ టెట్ ఫలితాలను ప్రకటించారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
సూర్యాపేట 80.76 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 52.38 శాతం ఫలితం నమోదైంది. పరీక్షకు హాజరైన వారిలో 6,728 మంది అర్హత పొందలేదు. పేపర్-1లో 1,544 మంది, పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 2,411 మంది, సోషల్ విభాగంలో 2,773 మంది ఫెయిలయ్యారు.
నవంబర్‌లో స్పెషల్ టెట్-2 :
టెట్ అర్హత లేని ఇన్‌సర్వీస్ టీచర్లకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం స్పెషల్ టెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్-2 నిర్వహించనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడనుండగా, నవంబర్ 16 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది.
2028 ఆగస్టులోపు టెట్ అర్హత పొందాల్సిన నేపథ్యంలో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. గత రెండు రెగ్యులర్ టెట్‌లలో సుమారు 47 వేల మంది, తాజా స్పెషల్ టెట్‌తో కలిపి దాదాపు 63 వేల మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 10 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సి ఉందని అంచనా.
ఇదే సమయంలో ఈ ఏడాది మరో రెగ్యులర్ టెట్ కూడా నిర్వహించనున్నారు. నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
