TS SSC Recounting : తెలంగాణ పదో తరగతి ఫలితాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పై బిగ్ అప్డేట్.. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే..
TS SSC Recounting Re Verification: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా.. ఎప్పుటి నుంచి అప్లై చేసుకోవాలంటే..
- Dharani Pilli
- Updated on- April 29, 2026 / 03:38 PM IST
Telangana ssc results 2026 students can apply for recounting reverification from april 30 to may 14 fee details here
TS SSC Recounting: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల విడుదల నేపథ్యంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈ నెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. రీకౌంటింగ్ కోసం రూ. 500 చెల్లించాలని తెలిపింది. రీ-వెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 1,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మార్కులు తక్కువ వచ్చాయని అనుమానం ఉన్న విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. నేడు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తంగా 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 5,751 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. తెలంగాణ వ్యాప్తంగా 6 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నేడు విడుదల చేసిన ఫలితాల్లో 96.26 శాతంతో బాలికలు పైచేయి సాధించారు.
ఫలితాలను results.bsetelangana.org తోపాటు https://10tv.in లోనూ చెక్ చేసుకోవచ్చు. అలానే ఫలితాలు చెక్ చేసుకోవాలని భావించే వారు… అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే కాక.. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
- వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం:
- మొదట 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ‘SSC Results’ అని టైప్ చేయాలి.
- ఆ తర్వాత హాల్‌టికెట్ నంబర్ ఇస్తే ఫలితాల వివరాలు వస్తాయని అధికారులు తెలిపారు.
