Telangana TET Notification : టెట్ రాసే టీచర్లకు అలర్ట్.. తెలంగాణ TET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది.. ముఖ్యమైన తేదీలివే!
Telangana TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్‌కు అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు కోరనుంది. నవంబర్ 16 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
- Sreehari A
- Published on- October 1, 2026 / 07:59 PM IST
Telangana TET Notification
- అక్టోబర్ 7 నుంచే తెలంగాణ ప్రత్యేక టెట్ దరఖాస్తులు
- తెలంగాణ టీచర్లకు కీలక అప్‌డేట్.. టెట్ నోటిఫికేషన్ విడుదల
- ఇన్-సర్వీస్ టీచర్లకు బిగ్ అప్డేట్.. నవంబర్‌లో ప్రత్యేక టెట్ పరీక్షలు
Telangana TET Notification : తెలంగాణలోని ఇన్-సర్వీస్ టీచర్లకు బిగ్ అలర్ట్.. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్న రెండో టెట్ (TET)కు సంబంధించిన నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ టీచర్లు ఈ ఛాన్స్ వినియోగించుకోవాలని సూచించింది. అక్టోబర్ 7, 2026 నుంచి ప్రత్యేక టెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అర్హత ఉన్న ఉపాధ్యాయులు అక్టోబర్ 16, 2026 వరకు అప్లయ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు, పరీక్షకు సంబంధించిన ఇతర నిబంధనలు, మార్గదర్శకాలను అధికారిక నోటిఫికేషన్‌లో విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థులు అప్లయ్ చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది.
నవంబర్ 16 నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు :
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న ప్రత్యేక టెట్ పరీక్షలు నవంబర్ 16, 2026 నుంచి నవంబర్ 21, 2026 వరకు వివిధ తేదీల్లో జరగనున్నాయి. పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పరీక్ష కేంద్రాలు, ఇతర ముఖ్యమైన సూచనలను అధికారిక ప్రకటనలో పరిశీలించాల్సి ఉంటుంది.
Read Also : Telangana Inter : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కులు!
ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించిన నిబంధనల్లో భాగంగా ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తు గడువును దృష్టిలో ఉంచుకుని ముందుగానే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవడం ముఖ్యం.
ముఖ్యమైన తేదీలివే :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : అక్టోబర్ 7, 2026
దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 16, 2026
ప్రత్యేక టెట్ పరీక్షలు : నవంబర్ 16 నుంచి 21, 2026 వరకు
ఇన్-సర్వీస్ టీచర్లకు సంబంధించిన ఈ స్పెషల్ టెట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా అప్లయ్ చేసుకోవాలి.
