TGPSC Age Limit: నిరుద్యోగులకు TGPSC గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు గరిష్ట వయోపరిమితి ఏకంగా పదేళ్లు పెంపు

కొత్త మార్పులతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. అర్హులైన వారు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచించారు.

  • Updated on- May 21, 2026 / 11:16 AM IST

Tgpsc Increase Upper Age Limit For Analyst Grade II Posts

TGPSC Age Limit: తెలంగాణలోని నిరుద్యోగులకు TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. కాలుష్య నియంత్రణ మండలిలో ‘అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II)’ పోస్టుల విషయంలో భారీ ఊరట ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ఏకంగా 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది TGPSC. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.86 ప్రకారం 10 ఏళ్ల వయో సడలింపు అమలు చేసింది. వయసు కారణంగా అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది. గత నెలలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా నిర్వహించనున్నారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు భారీ రిలీఫ్ కలిగింది. కాగా, కొత్త మార్పులతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. అర్హులైన వారు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచించారు.

జీవో ఎంఎస్ 86కు అనుగుణంగా కమిషన్ గరిష్ట వయోపరిమితిని పెంచింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు. రిజర్వ్డ్ కమ్యూనిటీల అభ్యర్థులకు మరో ఐదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హులైన అభ్యర్థులు మే 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కమిషన్ వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ద్వారా దరఖాస్తు ఫారాన్ని సమర్పించవచ్చు. అనలిస్ట్ గ్రేడ్-II పోస్టుల కోసం నిర్వహించే నియామక పరీక్షలైన పేపర్ – I (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్) పేపర్ – II (కెమిస్ట్రీ)లను ఇంగ్లీష్, తెలుగు ద్విభాషా పద్ధతిలో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.

Also Read: ఉద్యోగులకు పండగే.. ఇక కంపెనీతో పనిలేదు.. PF డబ్బులు ఈజీగా తీసుకోవచ్చు.. ఎలాగంటే?