ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ ఓఎంఆర్ విధానంలోనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. మొదటిసారిగా నెగెటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలశ్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ ఓఎంఆర్ షీట్ బేస్డ్ గా జరుగనుంది. ఒరిజినల్ ఐడీ కార్డుతో పరీక్షకు హాజరు కావాలని సూచించింది. ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ కాకుండా అభ్యర్థులు జాగ్రత్త పడాలని తెలిపింది. ఓఎంఆర్ షీట్ డ్యామేజ్ అయితే స్కానర్ పరిగణనలోకి తీసుకోదు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పెన్ లను మాత్రమే వాడాలని సూచించించారు. ఇంగ్లీష్ వెర్షన్ ను మాత్రమే అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపింది.
రివైజ్డ్ హాల్ టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు ఒరిజినల్ ప్రూఫ్‌తో పాటు చేరుకోవాలని.. ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమంటున్నారు. ఇక ఈసారి గ్రూప్-2 పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 12 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.