TS EAMCET 2026 Result : తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌ .. టాపర్లు వీరే.. రిజల్ట్ తెలుసుకోండిలా..

TS EAMCET 2026 Result : రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్‌–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.

TS EAMCET 2026 Result

TS EAMCET 2026 Result : తెలంగాణ ఎప్‌సెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ -ఫార్మసీ) ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకిష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తదితరులతో కలిసి కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ-హెచ్‌ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు.

Also Read : Rajinikanth : కమల్, విజయ్‌పై రజనీకాంత్ సంచలన కామెంట్స్.. అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను

ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను eapcet.tgche.ac.in  వెబ్ సైట్ లో చూడొచ్చు.

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10 ర్యాంకర్లు వీరే..
♦ ఎం. రుషి (ఉప్పల్‌)
♦ అన్షుల్‌ (మూసాపేట్‌)
♦ ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)
♦ జె.రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)
♦ ఎ.సాయి నిఖిత్‌ (మహబూబ్‌నగర్‌)
♦ ఎం.ఆస్నా (మేడ్చల్‌)
♦ వి.శరద్‌ మహీశ్వరి (హైదరాబాద్‌)
♦ టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్‌)
♦ బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)
♦ ఆర్‌.జయంత్‌ శేఖర్‌ (మేడ్చల్‌)

అగ్రికల్చర్‌- ఫార్మసీ విభాగంలో టాప్‌ -10 ర్యాంకర్లు వీరే..
♦ ఎం.అహ్మద్‌ (హైదరాబాద్‌)
♦ టి.నివృత్‌ సాయికిరణ్‌ (హైదరాబాద్‌)
♦ జి.సాహితి గీతిక (రంగారెడ్డి)
♦ ఎం.జయసింహ (హైదరాబాద్‌)
♦ ఎ.అన్వాస్‌ (హైదరాబాద్‌)
♦ ఎన్‌.జెరూష ( సత్యసాయి జిల్లా)
♦ పి.అనురాగ్‌ (తూర్పుగోదావరి)
♦ బి.సాయిశరణ్‌ (సూర్యాపేట)
♦ ఎం.సత్యశ్రీకర్‌ (తూర్పుగోదావరి)
♦ ఎం.రుతుంబిక (మేడ్చల్‌)

ఫలితాలు వెల్లడి కావడంతో తదుపరి విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి వచ్చే రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.

TS EAMCET 2026 ర్యాంక్ కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
♦ అభ్యర్థులు తమ TS EAMCET 2026 ఫలితాన్ని తనిఖీ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి eapcet.tgche.ac.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
♦ హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న “TS EAMCET 2026 ఫలితం” లేదా “ర్యాంక్ కార్డ్” లింక్‌పై క్లిక్ చేయండి.
♦ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన లాగిన్ వివరాలను నమోదు చేయండి.
♦ TS EAMCET 2026 ఫలితాలను వీక్షించడానికి వివరాలను సమర్పించండి.
♦ భవిష్యత్ అడ్మిషన్, కౌన్సెలింగ్ ప్రయోజనాల కోసం TS EAMCET 2026 ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోండి.