TS ICET Counselling : అక్టోబర్ 8 నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్
- bheemraj
- Published On : October 7, 2022 / 08:43 PM IST
TS ICET Counselling
TS ICET Counselling : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (అక్టోబర్8,2022) నుంచి ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ రేపటి నుంచి బుధవారం వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుత సీట్లు కేటాయించనున్నారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు.. 18 నుంచి 21వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ జరుగనుంది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీతో రూ.40వేలు జీతం
అక్టోబర్ 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 28వ తేదీన తుది విడత సీట్లను కేటాయించనున్నారు. 28 నుంచి 30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నవంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
