Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీతో రూ.40వేలు జీతం

ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుసంధానమైన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ టీం 2022 జులై 29న ఉద్యోగాలు కల్పించనుంది. అభ్యర్థులను మూడు రౌండ్లలో ఇంటర్వ్యూలు జరిపి రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ వేతనం కల్పిస్తారు.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. డిగ్రీతో రూ.40వేలు జీతం
ad

 

 

Flipkart: ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుసంధానమైన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ టీం 2022 జులై 29న ఉద్యోగాలు కల్పించనుంది. అభ్యర్థులను మూడు రౌండ్లలో ఇంటర్వ్యూలు జరిపి రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ వేతనం కల్పిస్తారు. అమలాపురంలోని పేరమ్మ అగ్రహారం వేదికగా ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

డెలివరీ అసోసియేట్ కేటగిరీలో ఉన్న 55 ఖాళీలను భర్త చేయనున్న క్రమంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులు దీనికి అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పది, ఇంటర్, డిగ్రీ ఉంటే సరిపోతుంది. పూర్తి వివరాలకు 9581422339, ఏపీఎస్ఎస్డీసీ హెల్ప్ లైన్ నెంబర్ 9988853335లను సంప్రదించాలని పేర్కొన్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ మరియు ఫైనల్ రౌండ్ నిర్వహిస్తారు. తద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సైతం అమలాపురంలోనే పని చేయాల్సి ఉంటుంది.