Telangana Engineering Jobs : తెలంగాణలో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
- bheemraj
- Published On : September 13, 2022 / 05:53 PM IST
Telangana engineering jobs (1)
Telangana Engineering Jobs : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
Job Vacancies : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా లక్షల ఉద్యోగాలు
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/ కు లాగిన్ అయి తెలుసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఇటీవలే మున్సిపల్ డిపార్టుమెంట్‌లో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర, మహిళ శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
