UGC NET 2022
UGC NET 2022 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) డిసెంబర్ 2022 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. 57 సబ్జెక్టులకు సంబంధించిన ఫేజ్-1 కోసం అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2022 పరీక్షలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 10 వరకు నిర్వహించాలని షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఫేజ్ 1 పరీక్షలు ఫిబ్రవరి 21 మరియు 24 తేదీల మధ్య నిర్వహించనున్నారు.
యూజీసీ నెట్ 2022 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
దశ 1 : అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inని ఒపెన్ చేయాలి.
దశ 2: హోమ్‌పేజీలో ఇచ్చిన అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
దశ 3: అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ వంటి మీ వివరాలను పూరించాలి.
దశ 4; అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
UGC NET డిసెంబర్ 2022, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం షిఫ్టుల వారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతను ఈ పరీక్ష ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, యూజీసీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మూడుగంటల సమయం కేటాయిస్తారు. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొదటి పేపర్‌లో యాభై ప్రశ్నలు, రెండో పేపర్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి.