UPSC CMS Final Result : యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి

UPSC CMS Final Result : యూపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024ను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)లో చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UPSC CMS Final Result 2024 Declared Today

UPSC CMS Final Result : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CMS), 2024 ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించింది. యూపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024ను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)లో చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక నోటీసు ప్రకారం.. యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ జూలై 14న జరిగిన రాత పరీక్ష (పార్ట్ 1), సెప్టెంబర్ నుంచి నవంబర్ 2024 మధ్య నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (పార్ట్ 2) ఫలితాల ఆధారంగా ప్రీపేర్ చేస్తారు.

యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024 చెక్ చేసుకోవచ్చు :

  • అభ్యర్థులు కింద సూచించిన డైరెక్ట్ లింక్ ద్వారా ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.
  • యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ని (upsc.gov.in)లో విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాక డౌన్‌లోడ్ చేసి మీ రోల్ నంబర్ కోసం చెక్ చేయండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024 : డైరెక్ట్ లింక్
కేటగిరీ (1) మొత్తం 165 మంది అభ్యర్థులు, కేటగిరీ సెకండ్‌కి 600 మంది అభ్యర్థులు సిఫార్సు చేస్తారు. సిఫార్సు చేసిన 304 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వం, యూపీఎస్‌సీ సీఎంఎస్ తుది ఫలితాల మార్క్ షీట్ ఫలితాలు వెల్లడైన 15 రోజులలోపు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple iPhone 16 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?