UPSC
UPSC Vacancies : కేంద్రప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగ ఖాళీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిప్యూటీ కమిషనర్ హార్టికల్చర్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ టాక్సికాలజీ 1, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్ 1 పోస్టు, సైంటిస్ట్ బి నాన్ డిస్ట్రిక్టివ్ 1, సైంటిఫిక్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ టెక్నికల్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ ఐటీ 1 ఖాళీ, సైంటిస్ట్ బి టాక్సికాలజీ 1 పోస్టు, సైంటిస్ట్ బి సివిల్ ఇంజనీరింగ్ 9 , జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆపీసర్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ 76, డిప్యూటీ లెజిస్టేటివ్ కౌన్సిల్ హిందీ బ్రాంచ్ 3 , అసిస్టెంట్ ఇంజినీర్ గ4, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 2 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత లకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేది ఫిబ్రవరి 2, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; upsc.gov.in పరిశీలించగలరు.