TG ICET 2025: టీజీ ఐసెట్ అప్డేట్స్.. మొదలైన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు

తెలంగాణ టీజీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్(TG ICET 2025) ప్రక్రియ మొదలయ్యింది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ల

TG ICET 2025: టీజీ ఐసెట్ అప్డేట్స్.. మొదలైన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు

TG ICET 2025 Counselling has started.

Updated On : August 22, 2025 / 12:41 PM IST

TG ICET 2025: తెలంగాణ టీజీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 28వ తేదీలోపు రిజిస్ట్రేషన్(TG ICET 2025) పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgicet.nic.in/ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Hyd Police Academy jobs: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమిలో ఉద్యోగాలు.. నెలకు రూ.45 వేలు జీతం.. పూర్తి వివరాలు

రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgicet.nic.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో ప్రాసెసింగ్ ఫీజు ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి
  • తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాలు.. భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే..

ముఖ్యమైన తేదీలు:

  • ఆగస్ట్ 22 నుంచి 29వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన.
  • ఆగస్ట్ 25 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • ఆగస్ట్ 30వ తేదీన ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • సెప్టెంబర్ 2వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
  • సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ చేసుకోవాలి.