TG ICET 2025: తెలంగాణ టీజీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 28వ తేదీలోపు రిజిస్ట్రేషన్(TG ICET 2025) పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgicet.nic.in/ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.