Hyd Police Academy jobs: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. హైదరాబాద్ పోలీస్ అకాడమిలో ఉద్యోగాలు.. నెలకు రూ.45 వేలు జీతం.. పూర్తి వివరాలు
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని (Hyd Police Academy jobs) సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ

notification released for hyd police academy jobs
Hyd Police Academy jobs: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్(Hyd Police Academy jobs) పోస్టులను భర్తీ చేయనుంది. కాబట్టి.. అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.svpnpa.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01-04-2025 నాటికి 64 సంవత్సరాలు మించకూడదు.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,384 వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మీ దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
అసిస్టెంట్ డైరెక్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరామ్‌పల్లి, హైదరాబాద్.
CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాలు.. భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే..