notification released for hyd police academy jobs
Hyd Police Academy jobs: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్(Hyd Police Academy jobs) పోస్టులను భర్తీ చేయనుంది. కాబట్టి.. అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.svpnpa.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01-04-2025 నాటికి 64 సంవత్సరాలు మించకూడదు.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,384 వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
మీ దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
అసిస్టెంట్ డైరెక్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరామ్‌పల్లి, హైదరాబాద్.
CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాలు.. భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే..