BSF Recruitment 2025: అలర్ట్.. బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్.. డైరెక్ట్ లింక్ ఇదిగో
సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్(BSF Recruitment 2025) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

BSF Recruitment 2025: Last date to apply for BSF Constable Tradesman posts is tomorrow
BSF Recruitment 2025: సరిహద్దు భద్రతా దళంలో(BSF) ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 3588 పోస్టులను భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 23 అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in, bsf.gov.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీ అప్లికేషన్‌లో(BSF Recruitment 2025) ఏవైనా తప్పులు ఉంటే ఆగస్టు 26 వరకు సవరణలు చేసుకొనే అవకాశం ఉంది.
అర్హతలు:
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సు చేసి ఉండాలి. 2 సంవత్సరాల ఐటీఐ లేదా 1 సంవత్సరం కోర్సు + 1 సంవత్సరం అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు వయస్సు 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు నాలుగు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటిడి శారీరక ప్రమాణాల పరీక్ష, రెండవది ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, మూడవది పూర్తి శరీర పరీక్ష.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీఎస్‌ఎఫ్ సిబ్బంది, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు ఉండదు.