NIO Recruitment : విశాఖలోని ఎన్ ఐ వో ప్రాంతీయ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అభ్యర్ధుల వయసు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది.

NIO Recruitment : విశాఖలోని ఎన్ ఐ వో ప్రాంతీయ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీ

NIO Recruitment

Updated On : October 21, 2022 / 5:33 PM IST

NIO Recruitment : సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కి చెందిన విశాఖలోని ఎన్ ఐ వో ప్రాంతీయ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 5 ఖాళీలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ. 25,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 20,000 చెల్లిస్తారు.

దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీగా అక్టోబర్ 30, 2022 ను నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్: hrdg@nio.org పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.nio.org పరిశీలించగలరు.