Ganesh Chaturthi Car Deals : గణేష్ చతుర్థి ఆఫర్లు.. మారుతి, హ్యుందాయ్, హోండా, ఎంజీ కార్లపై రూ. 6 లక్షల వరకు డిస్కౌంట్లు.. త్వరపడండి..!
Ganesh Chaturthi Car Deals 2025 : గణేష్ చతుర్థి సందర్భంగా ఈ బ్రాండ్ల కార్లపై రూ. 6 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నాయి..

Ganesh Chaturthi Car Deals 2025
Ganesh Chaturthi Car Deals 2025 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? పండుగ సీజన్ ప్రారంభమైంది. కొత్త కారు కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. 2025 గణేష్ చతుర్థిని (Ganesh Chaturthi Car Deals 2025) పురస్కరించుకుని కార్ల తయారీ కంపెనీలు కూడా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.
అందులో ఎంజీ మోటార్స్, మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తక్కువ ధరలో కొత్త కారు ఇంటికి తెచ్చుకోవచ్చు. కొన్ని మోడళ్లపై రూ.6 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఏయే బ్రాండ్ల కార్లపై ఎంతవరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎంజీ మోటార్స్ డిస్కౌంట్ :
గణేష్ చతుర్థి సందర్భంగా ఎంజీ మోటార్స్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అతి చిన్న కారు ఎంజీ కామెట్ ఈవీ రూ. 56వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, కొత్త బ్యాటరీ సర్వీస్ మోడల్‌గా ఉంటుంది. ZS EV ఆస్టర్‌పై సంస్థ రూ. 1.10 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.
6 వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఎంజీ ఇటీవల ఆస్టర్ ధరను రూ. లక్ష తగ్గించి రూ. 9.99 లక్షలకు తగ్గించింది. హెక్టర్ కొనుగోలుదారులు ఈ నెలలో రూ. 1.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంజీ ప్రీమియం SUV గ్లోస్టర్ రూ. 6 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
హోండా కార్ల డిస్కౌంట్ :
ఈ సీజన్‌లో హోండా ‘ది గ్రేట్ హోండా ఫెస్ట్’ను అందిస్తోంది. హోండా సిటీ రూ.1.07 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. హోండా సిటీ e:HEV హైబ్రిడ్ కొనుగోలుపై రూ. 96వేల వరకు ఆదా చేయొచ్చు. కొత్తగా లాంచ్ అయిన హోండా ఎలివేట్ రూ. 1.22 లక్షల ఆఫర్లతో వస్తుంది, రేంజ్-టాపింగ్ ZX వేరియంట్ కొనుగోలుపై మరింత తగ్గింపు పొందవచ్చు. సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ కూడా రూ. 77,200 వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.
Ganesh Chaturthi Car Deals 2025 : మారుతి సుజుకి డిస్కౌంట్ :
మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లు, SUV, MPV కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. జిమ్నీ ఆల్ఫా మోడల్‌పై గరిష్టంగా రూ. లక్ష తగ్గింపుతో వస్తుంది. స్విఫ్ట్ AMT కస్టమర్లు రూ. 1.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. వ్యాగన్R LXi కొనుగోలుదారులు రూ. 1.15 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పెద్ద కార్లపై మారుతి ఇన్విక్టో రూ. 1.25 లక్షల తగ్గింపు అందిస్తుంది. గ్రాండ్ విటారా గరిష్టంగా రూ. 2 లక్షల వరకు సేవింగ్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్ :
హ్యుందాయ్ కూడా పండుగ ఆఫర్లను అందిస్తోంది. గ్రాండ్ i10 నియోస్ కొనుగోలుదారులు రూ. 30వేలు బోనస్, రూ. 25వేలు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ యాక్సెంట్ కూడా ఇలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది.
టక్సన్, అల్కాజార్, క్రెటా, వెర్నా వంటి ఇతర వేరియంట్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ ఐయోనిక్ 2024 ఈవీ రూ. 4 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. కచ్చితమైన ఆఫర్ల కోసం కస్టమర్‌లు తమ లోకల్ డీలర్‌ను సంప్రదించాలి.