Ashwin : ఇదేం సిత్రమో.. అశ్విన్ మొదటి, ఆఖరి ఐపీఎల్ వికెట్లు ఒకే రోజున ఇంకా..
2009 ఐపీఎల్ సీజన్‌లో 54వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ (Ashwin) అరంగ్రేటం చేశాడు. ఈ

Who were the first and last batters to be dismissed by Ashwin in the IPL
Ashwin : రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2009లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన అశ్విన్ తన సుదీర్ఘ కెరీర్‌లో 221 మ్యాచ్‌లు ఆడాడు. 187 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో 833 పరుగులు సాధించాడు.
ఫస్ట్ వికెట్, లాస్ట్ వికెట్..
2009 ఐపీఎల్ సీజన్ 54వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అశ్విన్ (Ashwin) అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. తన తొలి వికెట్ శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగ్కరది కావడం విశేషం. ఇక చివరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై ఆడాడు. ఈ మ్యాచ్‌లో 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ అశ్విన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడం గమనార్హం.
CPL 2025 : ఒక్క బంతికే 22 పరుగులు.. ఎలా వచ్చాయంటే..?
ఇక్కడ కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు మ్యాచ్‌లు కూడా మే 20వ తేదీనే జరగడం విశేషం. అశ్విన్ తన ఫస్టు, లాస్ట్ మ్యాచ్‌లో కూడా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు చొప్పున తీయడం విశేషం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.