AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సెక్షన్ ఆఫీసర్కో, ర్ట్ ఆఫీసర్, సెక్యురిటీ ఆఫీసర్,అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర సెక్షన్‌లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : November 10, 2022 / 07:26 PM IST
Vacancies in Andhra Pradesh High Court
AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ట్రాన్ఫర్ ప్రాతిపదికన 31 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 26, ట్రాన్సఫర్ కింద 5 పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సెక్షన్ ఆఫీసర్కో, ర్ట్ ఆఫీసర్, సెక్యురిటీ ఆఫీసర్,అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర సెక్షన్‌లలో ఇప్పటికే సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840ల నుంచి రూ.1,36,520ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/recruitment.html పరిశీలించగలరు.
