CTUAP Recruitment : ఆంధ్రప్రదేశ్ లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ , స్లెట్, సెట్ లో అర్హత సాధించాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, అటెండింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Vacancies in Central Tribal University of Andhra Pradesh

CTUAP Recruitment : ఆంధ్ర ప్రదేశ్ లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీల లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, యూడీసీ , స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ అసిస్టెంట్ తదితర ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ , స్లెట్, సెట్ లో అర్హత సాధించాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, అటెండింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులను ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ది రిక్రూట్ మెంట్ సెల్ , సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, కొండకరకమ్, విజయనగరం జిల్లా 535003. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 10 నవంబర్ 2022గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 20 నవంబర్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ctuap.ac.in పరిశీలించగలరు.