GRSE Recruitment : గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.23,800ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు నవంబర్‌ 21, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Vacancies in Garden Reach Shipbuilders and Engineers Ltd

GRSE Recruitment : భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 డిజైన్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్/నేవల్ ఆర్కిటెక్చర్/షిప్ బిల్డింగ్/సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.23,800ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు నవంబర్‌ 21, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://grse.in/ పరిశీలించగలరు.