IRDAI Recruitment : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, డిస్ట్ర్కిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

IRDAI Recruitment

IRDAI Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఇన్సూరెన్ష్ రెగ్యులేటర్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఐఆర్డీఏఐ) లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి అక్యురియల్, ఫైనాన్స్ లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, డిస్ట్ర్కిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 44,500 చెల్లిస్తారు.

READ ALSO : Rabbit Farming : కుందేళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు! లాభ సాటిగా కుందేళ్ల పెంపకం?

అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువుతేది 10 మే 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://irdai.gov.in/ పరిశీలించగలరు.