Rabbit Farming : కుందేళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు! లాభ సాటిగా కుందేళ్ల పెంపకం?

కుందేళ్ల షెడ్‌ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్‌ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.

Rabbit Farming : కుందేళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు! లాభ సాటిగా కుందేళ్ల పెంపకం?

Rabbit Farming : కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, ఆసక్తిగలవారెవరైనా కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి పెంపకానికి స్ధలం కూడా చాలా తక్కవగా అవసరమౌతుంది. అదనపు కూలీ ఖర్చులు ఉండవు ఒక కుటుంబంలోని సభ్యులే ఫామ్ నిర్వాహణ బాధ్యతలు చూసుకోవచ్చు. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నారు. దీని మాంసంలో అధిక పోషకవిలువలు కలిగి ఉండటంతో దీనిని మంచి డిమాండ్ ఉంది.

నిర్వాహణ ఖర్చు తక్కువే : ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి. కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను ఇవి సమర్ధవంతంగా వినియోగించుకోగలవు. కావున ఇది రైతులకు వరం లాంటిది. వ్యాధులకు గురికావడం తక్కువగా ఉండడం చేత మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. కుందేళ్లు ఎక్కువగా గడ్డిపైన ఆధారపడి యుండుట చేత దీనిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

కుందేళ్లలో జాతులు ; మన దేశంలో కుందేళ్లను రెండు రకాల కుందేళ్ల ను పెంచుతారు. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్‌ కుందేళ్లు అంటారు. చలి ప్రాంతాలు అయిన జమ్ము కాశ్మీర్‌ మరియు సిక్కిం తదితర ప్రాంతంలో అంగొరా కుందేళ్లను పెంచుతున్నారు. అంగోరా జాతిలో విభిన్న రకాలు ఉన్నాయి. బ్రిటీష్‌ అంగోరా, జెర్మన్‌ అంగోరా, రష్యన్‌ అంగోరా మొదలగునవి.న్యూజిలాండ్‌ వైట్‌, సోవియట్‌ చించిల్లా, ఫ్లెమిష్‌ జైంట్‌, గ్రేజైంట్‌ మరియు కాలిఫోర్నియన్‌ వైట్‌ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి అనువైనవిగా ఉంటాయి.

కుందేళ్ల షెడ్ ల నిర్మాణం ; కుందేళ్ల షెడ్‌ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్‌ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దం ఎక్కువగా ఉన్నట్లయితే కుందేళ్లు భయపడటమే కాకుండా ఒత్తిడికి గురి అవుతూ ఉత్పాదక సామర్ధ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్‌ను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి. మలమూత్రాలను తీసివేయాలి. మరియు తేమ బూజులు లేకుండా జాగ్రత్త వహించాలి. డీప్‌ లిట్టర్‌ పద్ధతి, కేజ్‌ పద్ధతి ఇలా రెండు విధానాల్లో వీటిని పెంపకం చేపట్ట వచ్చు.

కుందేళ్లకు దాణా ; కుందేళ్లకు పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌, బర్సీమ్‌ తప్పకుండా ఇవ్వవలెను. రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి ఇచ్చినచో మేతపై అగు ఖర్చు తగ్గుతుంది. అవి ఆరోగ్యంగా ఎదగాలి అంటే పుష్టికరమైన పచ్చి మేత పెట్టవలెను. ప్రతి కుందేలుకు సుమారు 1 లీటరు త్రాగు నీటిని 200-300 గ్రా. దాణా, 200 గ్రా. పచ్చిమేత అవసరము. కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 15-17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

కుందేళ్ల మాంసం ఆరోగ్యానికి ; కుందేళ్ల మాంసంలో 22 శాతం వరకు మాంసకృత్తులు ఉండడం మరియు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ మాంసాన్ని స్వీకరించవచ్చు. కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది.