IIMB Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరులో పలు పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు నిబంధనల లోబడి ఉంటుంది. రిజర్వేషన్‌కు కలిగిన వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : September 9, 2023 / 02:56 PM IST
IIMB Recruitment
IIMB Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరులో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ మీడియా కంటెంట్ రైటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు నిబంధనల లోబడి ఉంటుంది. రిజర్వేషన్‌కు కలిగిన వారికి వయో సడలింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక ప్యాకేజీ రూ.7,26,000 నుంచి రూ. 9,52,000 మధ్య చెల్లించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 10, 2023గా ఆఖరు గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iimb.ac.in/ పరిశీలించగలరు.
